రీజనల్ ట్రాన్స్​పోర్ట్  అథారిటీ మెంబర్ గా శ్రీనివాస్

లక్సెట్టిపేట, వెలుగు: లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అంకతి శ్రీని వాస్ మంచిర్యాల జిల్లా రీజనల్ ట్రాన్స్​పోర్ట్ అథారిటీ మెంబర్ గా నియామకమ య్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ చేతుల మీదుగా నియామకపత్రం అందుకున్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్​లో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని అన్నారు. తనకు ఈ పదవి దక్కేలా కృషి చేసిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.